EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్‌లో ఏసీబీ మెరుపు దాడులు.. కారులో రూ.2.40 లక్షలతో పట్టుబడ్డ వాటర్ బోర్డు ఉన్నతాధికారి!

    Author SHANKARAVAM NEWS | 26 Oct 2026, 10:45 AM | TELANGANA
    హైదరాబాద్‌లో ఏసీబీ మెరుపు దాడులు.. కారులో రూ.2.40 లక్షలతో పట్టుబడ్డ వాటర్ బోర్డు ఉన్నతాధికారి!

    హైదరాబాద్‌లో ఏసీబీ మెరుపు దాడులు.. కారులో రూ.2.40 లక్షలతో పట్టుబడ్డ వాటర్ బోర్డు ఉన్నతాధికారి!

    హైదరాబాద్ జలమండలి ఖైరతాబాద్ జాయింట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ వద్ద రూ.2.40 లక్షల లెక్కల్లో లేని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన వివరాలు చెప్పకపోవడంతో నగదు జప్తు చేసి కేసు నమోదు చేశారు.
    హైదరాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అక్రమంగా వసూలు చేసిన నగదుతో ఇంటికి వెళ్తున్నట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఏసీబీ సిటీ రేంజ్-II బృందం శనివారం రాత్రి రాజ్ భవన్ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్ ఎదురుగా కాపు కాసింది. శ్రీనివాస్ ప్రయాణిస్తున్న మారుతి స్విఫ్ట్ కారును (TS08 GQ 3699) అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కారులో లెక్కల్లో చూపించని రూ. 2,40,000 నగదును అధికారులు గుర్తించారు.
    కారులో లభించిన భారీ నగదుకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నించగా ఆయన ఎలాంటి సరైన సమాధానం చెప్పలేకపోయారు. పొంతన లేని సమాధానాలు చెబుతూ నీళ్లు నమలడంతో ఏసీబీ అధికారులు ఆ మొత్తాన్ని లెక్కల్లో లేని నల్లధనంగా నిర్ధారించారు.
    హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు కారులో ఎంత లెక్కల్లో చూపని నగదు లభించింది?
    రూ. 3,20,000
    రూ. 5,00,000
    రూ. 1,50,000
    రూ. 2,40,000
    తక్షణమే ఆ నగదును స్వాధీనం చేసుకుని అధికారికంగా పంచనామా నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద లోతుగా దర్యాప్తు ప్రారంభించడంతో పాటు తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు సైతం సమాచారం అందించారు.