EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఐజీ షాహనవాజ్ ఖాసిం తనిఖీలు!_ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.. అధికారులకు ఐజీ ఆదేశాలు!

    Author SHANKARAVAM NEWS | 13 Oct 2026, 10:11 AM | TELANGANA
    చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఐజీ షాహనవాజ్ ఖాసిం తనిఖీలు!_ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.. అధికారులకు ఐజీ ఆదేశాలు!

    చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఐజీ షాహనవాజ్ ఖాసిం తనిఖీలు!_
    రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.. అధికారులకు ఐజీ ఆదేశాలు!
    చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి విధులు, కేసుల దర్యాప్తు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం...
    తనిఖీ సందర్భంగా ఐజీ వెంట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...
    జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశం.
    అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచన.
    హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించాలని పోలీసులకు దిశానిర్దేశం.
    మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. పోక్సో కేసుల్లో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశం.
    దొంగతనాలు, వాహనాల చోరీల నియంత్రణకు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని సూచన.
    రౌడీషీటర్లు, పునరావృత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం.
    పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నేరస్తులకు శిక్షలు పడేలా పక్కా ఆధారాలతో దర్యాప్తు చేయాలని సూచన.
    సైబర్ నేరాల బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశం.
    ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యం.. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు ఐజీ దిశానిర్దేశం.
    ఈ తనిఖీలో నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి, చిట్యాల సీఐ సురేష్, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.