EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు.

    Author SHANKARAVAM NEWS | 07 Sep 2026, 07:23 PM | Politics, TELANGANA
      ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్  బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు.

    ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు.


    సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ఎన్నికల అధికారి పి. సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

      ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్  బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు.  - Additional Image

    ఈ సందర్భంగా జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని జిల్లా కలెక్టర్ వివరిస్తూ
    జిల్లాలో నోటీసులు జారీ చేసిన కేసుల తదనంతర ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు.
    డాక్యుమెంటేషన్‌ పరిశీలన,విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, డాక్యుమెంట్లు లేని కేసులకు అవసరమైన పత్రాలను త్వరగా సేకరించి ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
    ఫామ్‌–7, ఫామ్‌–8లను సిద్ధంగా ఉంచుకోవాలని బీఎల్‌ఓలను ఆదేశించడమే కాకుండా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వివరించామని సీఈఓ కి తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌ఓలు నోటీసులు జారీచేసిన ఓటర్లు సమర్పించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్ణీత సమయంలోపు పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

    ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,జిల్లారెవెన్యూ అధికారి దశరథ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు .