ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు.
ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల అధికారి పి. సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో నోటీసులు జారీ చేసిన కేసుల తదనంతర ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. డాక్యుమెంటేషన్ పరిశీలన,విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, డాక్యుమెంట్లు లేని కేసులకు అవసరమైన పత్రాలను త్వరగా సేకరించి ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్...