EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లగొండ జిల్లా జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ..

    Author SHANKARAVAM NEWS | 28 Aug 2026, 11:46 AM | Crime, TELANGANA
    నల్లగొండ జిల్లా జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ..

    నల్లగొండ జిల్లా జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ..

    భద్రతా పరంగా పటిష్ట చర్యలు చేపట్టాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచనలు ..

    నల్లగొండ జిల్లా జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ .. - Additional Image

    నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గురువారం నల్లగొండ జిల్లా జైలును సందర్శించి జైలు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జైలు సూపరింటెండెంట్‌తో కలిసి జైలు పరిసరాలు, భద్రతా విధానాలు, సెక్యూరిటీ పాయింట్లు, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాలను పరిశీలించి, భద్రతాపరంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.

    ఈ సందర్భంగా జైలు భద్రతకు సంబంధించి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన సూచనలు, సలహాలను జైలు సూపరింటెండెంట్‌కు జిల్లా ఎస్పీ అందజేశారు. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ఇవి కూడా చదవండి

    జైలు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భద్రతాపరంగా అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఎస్పీ సూచించారు. సెక్యూరిటీ పాయింట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా చూడాలని తెలిపారు.

    అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించే విధంగా ముందస్తు కార్యాచరణ సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. జైలులో భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, లోటుపాట్లు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దాలని తెలిపారు.

    జైలు భద్రత విషయంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ, సమన్వయంతో పనిచేయడం ద్వారా జైలు భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

    జైలు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, అప్రమత్తతతో పాటు నిరంతర పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

    ఈ సందర్శనలో జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు, సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.