నల్లగొండ జిల్లా జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ..
నల్లగొండ జిల్లా జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ .. భద్రతా పరంగా పటిష్ట చర్యలు చేపట్టాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచనలు .. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గురువారం నల్లగొండ జిల్లా జైలును సందర్శించి జైలు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జైలు సూపరింటెండెంట్‌తో కలిసి జైలు పరిసరాలు, భద్రతా విధానాలు, సెక్యూరిటీ పాయింట్లు, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాలను పరిశీలించి, భద్రతాపరంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జైలు భద్రతకు సంబంధించి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన సూచనలు, సలహాలను జైలు సూపరింటెండెంట్‌కు జిల్లా ఎస్పీ అందజేశారు....