EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతోపాటు, ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని“:అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి

    రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతోపాటు, ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని“:అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి

    హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతోపాటు, ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని“ జిల్లా స్థాయి జాతీయ రహదారి టాస్క్ ఫోర్స్ కమిటీ ” నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ రహదారి జిల్లా టాస్క్ ఫోర్స్ ససమావేశంలో బుధవారం తెల్లవారు ఝామున సూర్యపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మొదలుకొని, జాతీయ రహదారిపై సంభవిస్తున్న రహదారి ప్రమాదాల పై సమీక్షించడం జరిగింది.
    ఈ సమీక్ష సందర్భంగా స్థానిక సంస్థల ఇన్చార్జి ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడంలో భాగంగా రహదారిపై ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసే సూచిక బోర్డులతో పాటు, దాబాలు,హోటళ్లు, పార్కింగ్ స్థలాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మరోసారి పూర్తిస్థాయిలో డ్రైవర్లు,ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు .రోడ్డుకిరుపక్కల రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసే దాబాలు, హోటల్లు, వాహనాల కు గాలిని కొట్టే షాపులు, టీ కొట్లు, పాన్ డబ్బాల వంటివి రోడ్డుపై కాకుండా దూరంగా ఏర్పాటు చేసుకునేలా చూడాలని, ఇందుకు అవసరమైతే రోడ్డును ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసుకున్న వారికి నోటీసులు ఇవ్వాలని, నోటీసులకు స్పందించకుంటే క్రేన్లు ఏర్పాటు చేసి తొలగించేలా చూడాలని అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రతి 30, 40 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అంబులెన్స్, క్రేన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ప్రమాదాలు సంబంధించినప్పుడు అంబులెన్స్, ఆసుపత్రి సిబ్బంది, పోలీసు, హైవే పెట్రోల్ సిబ్బంది తో పాటు, సంబంధిత శాఖలందరూ స్పందించాల్సిన అవసరం ఉందని, అలాగే డ్రైవర్లు నిరంతరం డ్రైవింగ్ చేయడం వలన ఉదయం సమయంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అలా కాకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి తిరిగి డ్రైవింగ్ చేసేలా అవగాహన కల్పించాలని, అంతేకాక 80 కిలోమీటర్లు మించి వేగం వెళ్లకుండా నియంత్రించాలని, ఎవరైనా రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన జరిమానాలు విధించాలని, ట్రక్కులకు, లారీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రక్ లే బేస్ లలో మాత్రమే వాహనాలు నిలిపేలా చూడాలని, నో పార్కింగ్ స్థలాలలో ఎట్టి పరిస్థితులలో వాహనాలు నిలపవద్దని, ఏదైనా ప్రమాదం జరిగి రహదారిపైనే వాహనాలు నిలిచిపోతే అక్కడ తప్పనిసరిగా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, సర్వీస్ రోడ్ల నుంచి ప్రధాన రహదారికి కలిసే చోట, అలాగే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నచోట, పార్కింగ్ స్థలాల వద్ద అవసరమైన బోర్డులు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
    జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించకుండా అన్ని నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరు వ్యక్తిగత భద్రతలో భాగంగా సీట్ బెల్ట్ , హెల్మెట్ ధరించాలని, రహదారులపై ప్రత్యేకించి జాతీయ రహదారిపై పెట్రోలింగ్ పెంచాలని ,1033 పై విస్తృత ప్రచారం కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెనాల్టీలు విధించాలని సూచించారు.
    జిల్లా రెవెన్యూ అధికారి దశరథ ,ఆర్ అండ్ బి, జాతీయ రహదారి, వైద్య ఆరోగ్య, పోలీస్,ఇతర సంబంధిత శాఖల అధికారులు .

    రహదారిపై ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ పెంచడంతోపాటు, ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని“:అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి  - Additional Image