EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్‌పై లంచం డిమాండ్ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

    Author SHANKARAVAM NEWS | 26 Aug 2026, 05:49 AM |
    డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్‌పై లంచం డిమాండ్ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

    నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయంలో అక్రమాల ఆరోపణలు
    డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్‌పై లంచం డిమాండ్ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు
    నల్లగొండ: నల్లగొండ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలు, లంచాల వ్యవహారాలపై ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన సందెనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమికి ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోగా, డబ్బులు ఇస్తేనే పని చేస్తానంటూ డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్ ఇబ్బందులకు గురిచేశారని బాధితుడు ఆరోపించారు.

    తన పని కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ జీపీఓ లచ్చయ్య ద్వారా కూడా ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జీపీఓలు తన మాటే వింటారని, ఇతరులెవరూ సహాయం చేయలేరని, డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని డిప్యూటీ తహసీల్దార్ చెప్పినట్లు ఆరోపించారు.

    లంచం ఇవ్వకుండా తన పని జరగడం లేదంటూ బాధితుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన జిల్లా కలెక్టర్, నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ చేపట్టాలని ట్రైనీ కలెక్టర్‌ను ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ నేపథ్యంలో గత మంగళవారం ట్రైనీ కలెక్టర్ నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్, జీపీఓ లచ్చయ్యపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ చేపట్టాలని ఎమ్మార్వోను ఆదేశించినట్లు సమాచారం.

    దీంతో జీపీఓ లచ్చయ్యను నల్లగొండ ఎమ్మార్వో సరెండ్ చేసినట్లు తెలిసింది. మరోవైపు డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి స్వయంగా ఫిర్యాదు చేస్తానని ట్రైనీ కలెక్టర్ వెల్లడించినట్లు సమాచారం.

    నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయంలో లంచాల ఆరోపణలపై జరుగుతున్న విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే, డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్‌పై వచ్చిన ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.