డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్‌పై లంచం డిమాండ్ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయంలో అక్రమాల ఆరోపణలు డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్‌పై లంచం డిమాండ్ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు నల్లగొండ: నల్లగొండ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలు, లంచాల వ్యవహారాలపై ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన సందెనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమికి ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోగా, డబ్బులు ఇస్తేనే పని చేస్తానంటూ డిప్యూటీ తహసీల్దార్ విజయశేఖర్ ఇబ్బందులకు గురిచేశారని బాధితుడు ఆరోపించారు. తన పని కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ జీపీఓ లచ్చయ్య ద్వారా కూడా ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జీపీఓలు తన మాటే వింటారని, ఇతరులెవరూ...