EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ

    Author SHANKARAVAM NEWS | 17 Aug 2026, 09:02 PM | TELANGANA
    నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ

    15 రోజుల్లోగా నిషేధిత భూములపై ద‌ర‌ఖాస్తుల పరిష్కారం
    నిషేధిత భూములపై స‌మాచారానికి
    టోల్‌ఫ్రీ నెంబ‌ర్ 1800 5994788

    ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌, ప్రైవేటు ఆస్తుల‌కు సంపూర్ణ ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం
    ప్ర‌త్యేక స్లాట్ల ద్వారా వెంట‌నే రిజిస్ట్రేష‌న్
    రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

    రాష్ట్రంలో 22ఎ నిషేధిత భూముల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఉన్న‌త‌స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.22 ఎపై స‌చివాల‌యంలో హైద‌రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి గారు మీడియాతో మాట్లాడారు . ఈక‌మిటీ వారానికోసారి స‌మావేశ‌మై ద‌ర‌ఖాస్తులు ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై స‌మీక్షించి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌ధానంగా ఈ నాలుగు జిల్లాల్లోనే స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంద‌ని, మేడ్చ‌ల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో 511 ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. వీటితోపాటు మిగిలిన జిల్లాల్లో 22/ఎ దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించామ‌న్నారు. దీనికోసం అవసరమైతే స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంచాలంటూ సూచించామ‌ని చెప్పారు.
    నిషేధిత భూములపై స‌మాచారానికి టోల్‌ఫ్రీ నెంబ‌ర్ 1800 5994788 ను ఏర్పాటు చేశామ‌ని ఎవ‌రు దీనికి స‌మాచారం పంపినా క‌నీసం 3 రోజ‌ల్లో స‌మాధానం అందుతుంద‌ని, ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌డ‌తార‌ని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చేయడానికి అవకాశం లేని కేసుల్లో ఎందుకు చేయలేమో ప్రజలకు స్పష్టమైన కారణం చెప్పాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించినట్లయితే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాల‌ని ఆదేశించామ‌న్నారు. రాష్ట్రంలోని భూదాన్ భూములు వాటికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, వివాదాలు, పరిష్కార మార్గాలపై సమగ్ర నివేదిక రూపొందిస్తామ‌న్నారు. యుఎల్‌సి జాబితాను స‌రిచేస్తున్నామ‌ని , అస‌లైన హ‌క్కుదారుల‌కు న్యాయం చేస్తూ మ‌రో రెండు రోజుల్లో త‌గు చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.హైద‌రాబాద్ జిల్లాలో ఒక ఆస్తికి స‌ర్వేశాఖ నుంచి టి ఎస్ ఎల్ ఆర్‌, స‌ర్వే నెంబ‌ర్లు ఇవ్వ‌డం జ‌రిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ రెండింటినీ సూప‌ర్ ఇంపోజ్ చేసే స‌మ‌యంలో స‌మ‌స్య‌లు ఏర్పడ్డాయి వీటిని కూడా ప‌రిష్క‌రిస్తున్నామ‌న్నారు. రంగారెడ్డి జిల్లాలో 12 ఎక‌రాలు ఉంటే అందులో రెండు ఎక‌రాలు భూధాన్‌ భూములుగా పేర్కొంటూ మొత్తం 12 ఎక‌రాల‌ను 22ఎలో పెట్ట‌డం జరిగింది.ఇలాగే కొన్ని దేవాదాయ , అట‌వీ భూములు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయ‌ని జియో ట్యాగింగ్ ద్వారా అస‌లు స్ధ‌లాల‌కు రిజిస్ట్రేష‌న్ చేసి మిగిలిన భూముల‌ను ఫ్రీహోల్డ్ చేయాలంటూ ఆదేశించామ‌న్నారు. గ‌తంలో హైకోర్టు ఆదేశాల నేప‌ధ్యంలో అప్ప‌ట్లో అధికారులు నిషేధిత భూముల జాబితానుంచి తొల‌గించిన భూముల వివ‌రాల‌ను వ‌దిలేయ‌డంతో అవి నేటికీ కొన‌సాగుతూ నిషేధిత జాబితాలో ఉండిపోయినందున అధికారుల చ‌ర్య‌ల‌తో సామాన్యులు కూడా ఇబ్బంది ప‌డ్డార‌ని మంత్రి క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. అయితే అధికారుల‌పై నెపం నెట్టి త‌మ ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య‌ను ప్ర‌జ‌ల‌పై వ‌దిలేయ‌ద‌ని దీనిని ప‌రిష్క‌రించే బాధ్య‌త కూడా తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. నిషేధిత భూముల పేరిట అస‌లైన య‌జ‌మానుల‌కు ఎటువంటి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని హామీ ఇచ్చారు. ఓ వైపు ప్ర‌భుత్వ భూముల‌ను ప‌రిర‌క్షిస్తూనే భ‌విష్య‌త్తులో ఎటువంటి పొర‌పాట్ల జ‌ర‌గ‌నివ్వ‌బోమ‌ని వెల్ల‌డించారు. సిఎస్‌-7, సిఎస్ -14కు సంబంధించి కొన్ని ద‌శాబ్దాలుగా కోర్టు కేసుల్లో మ‌గ్గుతున్నాయి. ఒక‌వైపు కోర్టులో హియ‌రింగ్స్ న‌డుస్తుండ‌గానే మ‌రోవైపు కొన్ని చోట్ల రెగ్య‌ల‌రైజేష‌న్ జ‌రిగింది. ఇవన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. హైద‌రాబాద్ లోని ఆల్విన్, ఆజ్‌బెస్టాస్ కాల‌నీల్లోని ప్రైవేటు భూముల‌ను విభ‌జించి అక్క‌డ రిజిస్ట్రేష‌న్ల‌కు ఇబ్బంది లేకుండా చేయాల‌ని ఆదేశించామ‌న్నారు.

    ఇవి కూడా చదవండి