నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ

15 రోజుల్లోగా నిషేధిత భూములపై ద‌ర‌ఖాస్తుల పరిష్కారం నిషేధిత భూములపై స‌మాచారానికి టోల్‌ఫ్రీ నెంబ‌ర్ 1800 5994788 ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌, ప్రైవేటు ఆస్తుల‌కు సంపూర్ణ ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం ప్ర‌త్యేక స్లాట్ల ద్వారా వెంట‌నే రిజిస్ట్రేష‌న్ రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి రాష్ట్రంలో 22ఎ నిషేధిత భూముల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఉన్న‌త‌స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.22 ఎపై స‌చివాల‌యంలో హైద‌రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా...