EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర..

    Author SHANKARAVAM NEWS | 29 Jul 2026, 09:04 PM | TELANGANA
    తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర..

    7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..

    రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ మేరకు పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, పైర్, జైళ్లశాఖలో పలు ఖాళీల భర్తీకి సంబంధించి 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామని పోలీసు నియామక మండలి తెలిపింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. వివరాలకు tgprb.in వెబ్‌సైట్ సంప్రదించాలన్న నియామక మండలి తెలిపింది.

    ఏయే విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు

    ఎస్ఐ(సివిల్) - 148
    ఎస్ఐ(ఏఆర్)-14
    టీజీఎస్‌పీ ఎస్‌ఐ - 12
    ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ ఎస్‌ఐ -3
    ఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) - 23 పోస్టులు

    ఇవి కూడా చదవండి

    కానిస్టేబుల్ : ఎస్ఐ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కాడా పోలీసు నియమాక మండలి నోటిపికేషన్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    కానిస్టేబుల్‌ (సివిల్‌) 3,697
    కానిస్టేబుల్ ఏఆర్‌ 1052
    పీటీవో కానిస్టేబుల్ 20
    కానిస్టేబుల్ మెకానిక్‌ 7
    స్పెషల్ పోలీస్‌ (ఎస్‌ఐ) 44
    కానిస్టేబుల్ 1,038
    ఫైర్ విభాగంలో :

    స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39,
    ఫైర్ ఫైటర్ 751 పోస్టులు
    డిప్యూటీ జైలర్ (మెన్‌) 14
    డిప్యూటీ జైలర్ (మహిళ) ఒక పోస్టు
    వార్డర్ (మేల్) 196
    వార్డర్ (మహిళ) 12 పోస్టులు భర్తీ

    త్వరలో దరఖాస్తు తేదీలు ప్రకటిస్తామన్న పోలీసు నియామక మండలి