EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏ ఈ ఈ సివిల్, ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

    Author SHANKARAVAM NEWS | 06 Nov 2026, 08:43 PM | TELANGANA
     ఏ ఈ ఈ సివిల్, ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ ఈ ఈ సివిల్, ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
    శుక్రవారం అయన ఈ పరీక్షలు నిర్వహిస్తున్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పిఆర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వెళ్లి తనిఖీ చేశారు.
    రెండు రోజులపాటు నిర్వహించే ఏఈఈ సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలకు 179 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం 10 నుండి 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు నిర్వహించిన మొదటిరోజు పరీక్షకు 104 మంది అభ్యర్థులు హాజరుకాగా, 75 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
    పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, తాగునీరు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు ప్రతిరోజు పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు. భద్రత కట్టుదిట్టంగా ఉండాలని అన్నారు.
    ఫ్లైయింగ్ స్క్వాడ్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శశికళ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నీలం రెడ్డి, డిపార్టుమెంటల్ అధికారి, పరిశీలకులు, నల్గొండ ఆర్డీవో వై .అశోక్ రెడ్డి, టీజీపీఎస్సీ స్పెషలాఫీసర్ సతీష్ కుమార్, తదితరులు ఉన్నారు .
    __________________________
    జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*