EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వలలో తహసీల్దార్, మండల సర్వేయర్!

    Author SHANKARAVAM NEWS | 13 Oct 2026, 07:39 AM | Crime, TELANGANA, ఆంధ్రప్రదేశ్
    అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వలలో తహసీల్దార్, మండల సర్వేయర్!

    అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వలలో తహసీల్దార్, మండల సర్వేయర్!
    🔸 రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కారు.
    🔸 అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, మండల సర్వేయర్ అరెస్ట్.
    🔸 మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి అరెస్ట్.
    🔸 రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ పట్టుబాటు.
    🔸 హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం లేఅవుట్ సర్వే నిర్వహణ కోసం లంచం డిమాండ్.
    🔸 జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.
    🔸 తొలుత రూ.2.30 కోట్ల లంచం డిమాండ్ చేసిన అధికారులు.
    🔸 ఆ తర్వాత లంచం మొత్తాన్ని రూ.2.20 కోట్లకు తగ్గించినట్లు ఏసీబీ వెల్లడి.
    🔸 తహసీల్దార్ ఆదేశాల మేరకు మండల సర్వేయర్ రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ దాడి.
    🔸 అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో ఏసీబీ అధికారుల చర్యలు.
    🔸 సర్వేయర్ చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్ ఫలితాలు.
    🔸 సర్వేయర్ వద్ద నుంచి లంచం సొమ్ము స్వాధీనం.
    🔸 ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.
    🔸 నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచిన అధికారులు.
    🔸 ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వెల్లడి.
    🔸 ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచిన ఏసీబీ.
    🔸 ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచన.
    🔸 వాట్సాప్ ద్వారా ఫిర్యాదులకు: 9440446106.
    🔸 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా.