EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ*

    Author SHANKARAVAM NEWS | 06 Oct 2026, 09:00 PM | TELANGANA
    *నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ*

    *విశిష్ట అతిథిగా హాజరైన అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాసగుప్త*
    నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
    పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.
    ఈ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు విశిష్ట అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
    ఈ సందర్భంగా MLA చదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం ఎల్లప్పుడూ ఐక్యత, సేవా భావం, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజ అభ్యున్నతికి సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, యువతను ప్రోత్సహిస్తూ విద్య, ఉపాధి, వ్యాపారం, క్రీడలు మరియు సామాజిక సేవా రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గం సంఘ సభ్యుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, సమాజంలోని ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్యుల ఐక్యతను మరింత బలోపేతం చేసి, సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
    ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ రాజకీయంగా ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని రాజకీయ పార్టీలు కరివేపాకులా ఆర్య వైశ్యలను వాడుకుంటున్నారు అని ఆయన అన్నారు
    నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగసరపు సుబ్బరాయగుప్త గారికి అన్ని వర్గాల నుండి మద్దతు ఉంది అని మునిసిపల్ చైర్మెన్ గా ఆయన్ని చేయాలని MLA గారిని కోరారు
    ఆర్య వైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి – విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత
    ఆర్య వైశ్య సమాజం ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార రంగాల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
    ఆర్య వైశ్య విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించడంతో పాటు స్కాలర్‌షిప్‌లు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, ప్రతిభావంతులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎదిగేందుకు మార్గదర్శకత్వం మరియు అవసరమైన సహకారం అందించాలన్నారు.
    చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలు, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని అన్నారు.

    *నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ* - Additional Image