EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..*

    Author SHANKARAVAM NEWS | 21 Sep 2026, 11:11 AM |
    వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు  – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..*

    *వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..*

    దేవరకొండ మండలం కొమ్ముతండాభీమనపల్లిలోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు ఆదివారం నిమజ్జన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

    నిమజ్జనానికి వచ్చే భక్తులు, వినాయక విగ్రహాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చెరువు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన చోట క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    నిమజ్జన ప్రాంతంలో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే ప్రతి వినాయక విగ్రహాన్ని రిజిస్టర్‌లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, విగ్రహాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నట్లు వెల్లడించారు.

    ఇవి కూడా చదవండి

    భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.

    అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
    నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు నిమజ్జన ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

    వినాయక నిమజ్జనంలో పాల్గొనే నిర్వాహకులు, భక్తులు పోలీస్ శాఖ సూచించే భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు కోరారు. గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బంది సూచనలను పాటిస్తూ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పారిశుద్ధ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, డీఎస్పీ,శ్రీనివాసరావు,వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.