EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భూసేకరణ చెల్లింపులలో భాగంగా జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ చెల్లింపులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

    Author SHANKARAVAM NEWS | 16 Sep 2026, 07:51 PM | TELANGANA, తెలంగాణ
    భూసేకరణ చెల్లింపులలో భాగంగా జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ చెల్లింపులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్  అధికారులను ఆదేశించారు.

    భూసేకరణ చెల్లింపులలో భాగంగా జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ చెల్లింపులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
    భూసేకరణ పై ప్రతి వారం నిర్వహించే సమీక్షలో భాగంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ, నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
    డిండి,చింతపల్లి,
    పెండ్లిపాకల, శివన్న గూడెం, తదితర రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన రైతులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినందున ఆయా ప్రాజెక్టుల వారిగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ చెల్లింపులన్నింటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో రెవెన్యూ, ప్రాజక్టుల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైనచోట జిల్లాస్థాయి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో తప్పుగా చెల్లింపులు చేయవద్దని, ఇంజనీరింగ్ అధికారులు , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆయా ప్రాజెక్టులు రిజర్వాయర్ల కింద సేకరించిన భూములకు సంబంధించి అవార్డు, అలైన్మెంట్ ,మ్యాపు, జియో కోఆర్డినేటర్ తో సహా ఫైలు నిర్వహించాలని ఆదేశించారు.

    రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, డిఆర్ఓ దశరథ, ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు.

    భూసేకరణ చెల్లింపులలో భాగంగా జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ చెల్లింపులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్  అధికారులను ఆదేశించారు. - Additional Image