EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్గొండ శ్రీధర్ గుప్త

    Author SHANKARAVAM NEWS | 01 Sep 2026, 11:07 PM | ANDHRA PRADESH, TELANGANA
    ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్గొండ శ్రీధర్ గుప్త

    ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్గొండ శ్రీధర్ గుప్త
    హైదరాబాద్: తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా శ్రీ ఆర్గొండ శ్రీధర్ గుప్త నియమితులైన సందర్భంగా తెలంగాణ వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA), తెలంగాణ వైశ్య మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ (TVMD) ఆధ్వర్యంలో హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
    ఫార్మసీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన శ్రీధర్ గుప్త రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పరిశ్రమ అభివృద్ధి, ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన ప్రమాణాల పెంపుదలకు విశేషంగా కృషి చేశారు. హైదరాబాద్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేలాది ఫార్మసీలకు నాయకత్వం వహిస్తూ, ఫార్మసీ రంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
    1990లలో “మిత్ర మెడికల్స్”తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేడు ఆధునిక సదుపాయాలతో కూడిన పలు ఫార్మసీ స్టోర్ల నిర్వహణ వరకు కొనసాగింది. ఫార్మా మాల్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ ఫార్మసీ రంగంలో నూతన విధానాలకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయన సేవలకు గుర్తింపుగా బెస్ట్ ఫార్మసీ అవార్డు కూడా అందుకున్నారు.
    రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల ఫార్మసీలు, వేలాది మంది ఫార్మసిస్టులకు ఆయన అనుభవం, నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఫార్మసీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు మరింత నాణ్యమైన ఫార్మసీ సేవలు అందించడంతో పాటు, ఫార్మసిస్టుల వృత్తి అభివృద్ధికి ఆయన నాయకత్వం దోహదపడుతుందని వారు ఆకాంక్షిస్తున్నారు.
    అదేవిధంగా, తెలంగాణ వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వైశ్య మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ (TVMD) ద్వారా వైద్య, ఆరోగ్య రంగాల్లో అనేక సేవలు అందిస్తూ సమాజంతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్న నాయకుడిగా శ్రీధర్ గుప్తకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
    ఆయన నాయకత్వంలో తెలంగాణ ఫార్మసీ రంగంలోని వైశ్య ఫార్మసిస్టులు, వైద్యులు, ఇతర వైద్యరంగ నిపుణుల మధ్య మరింత సమన్వయం ఏర్పడి, సమాజ అభివృద్ధికి విశేషంగా తోడ్పడాలని TVGOA, TVMD ప్రతినిధులు ఆకాంక్షించారు.
    సమాజ సేవ, వృత్తిపరమైన నిబద్ధత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతూ, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా నియమితులైన శ్రీ ఆర్గొండ శ్రీధర్ గుప్తకు మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
    అభినందనలతో: