EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించిన ; జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* ..

    Author SHANKARAVAM NEWS | 31 Aug 2026, 11:03 PM | TELANGANA
    పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించిన ; జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* ..

    *పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* ..

    నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు ఘనంగా సన్మానించారు.

    ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన N. యాదయ్య, సబ్ ఇన్స్పెక్టర్, Md. లియాఖత్ అలీ, ARSI, D. వెంకటేశ్వర్లు రెడ్డి, B. మోహన్ రావు, హెడ్ కానిస్టేబుల్లను జిల్లా ఎస్పీ గారు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సుమారు 36 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తిస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో వారు అందించిన సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు చూపిన అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత అభినందనీయమని తెలిపారు.

    పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన పదవీ విరమణ పొందిన సిబ్బంది అనుభవాలు, సేవలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఎస్పీ గారు పేర్కొన్నారు.

    పదవీ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతమైన జీవితం గడపాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు ఆకాంక్షించారు. పోలీస్ శాఖకు వారు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.