EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆరు నెలల్లోనే 3,300 మంది ఇంటికి...

    Author SHANKARAVAM NEWS | 09 Aug 2026, 02:19 PM | INTERNATIONAL, అంతర్జాతీయం
    ఆరు నెలల్లోనే 3,300 మంది ఇంటికి...

    విదేశాల్లో స్థిరపడి భవిష్యత్తును దిద్దుకుందామని ఎన్నో ఆశలతో కెనడా విమానమెక్కిన వేలాది మంది భారతీయుల కలలు కల్లలవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉక్కుపాదం కారణంగా మనవాళ్లకు డిపోర్టేషన్ రూపంలో ఊహించని షాక్ తగులుతోంది. కేవలం 2026 మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 3,323 మంది భారతీయులను కెనడా సరిహద్దు భద్రతా సంస్థ వెనక్కి పంపించేసింది. గత ఏడాది మొత్తం పంపించిన వారి సంఖ్యతో పోలిస్తే ఇది ఏకంగా 88 శాతానికి సమానం కావడంతో ఈ ఏడాదంతా కలిపి కొత్త రికార్డు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
    మెక్సికోను వెనక్కి నెట్టి తొలి స్థానంలో భారత్ గత ఐదేళ్లుగా కెనడా నుంచి అత్యధికంగా పంపించివేతలకు గురైన వారి జాబితాలో మెక్సికో మొదటి స్థానంలో ఉండేది. కానీ ఈ ఏడాది సీన్ పూర్తిగా మారిపోయింది. మెక్సికోను దాటుకుని భారతీయులే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
    ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 1,573 మంది మెక్సికన్లు వెనక్కి వెళ్లగా, మన దేశస్థులు మాత్రం ఆ సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఉన్నారు. ఒకప్పుడు అంటే 2021లో కేవలం 603 మంది భారతీయులే కెనడా నుంచి తిరిగొచ్చారు. కానీ అక్కడ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు బిగించడంతో ఆ సంఖ్య ఏడాదికేడాది విపరీతంగా పెరిగిపోయి ఈ స్థితికి చేరుకుంది.