EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంతర్రాష్ట్ర దొంగ ముఠాకు చెక్.. ఢిల్లీ దొంగను నల్గొండలోనే పట్టేసిన ఖాకీలు..!

    Author SHANKARAVAM NEWS | 07 Aug 2026, 05:55 PM | TELANGANA, వైరల్ వీడియోలు
    అంతర్రాష్ట్ర దొంగ ముఠాకు చెక్.. ఢిల్లీ దొంగను నల్గొండలోనే పట్టేసిన ఖాకీలు..!


    రూ.3.25 లక్షల నగదు, స్కూటీ, చోరీ పరికరాల స్వాధీనం..

    పరారీలో మరో ఇద్దరు నిందితుల కోసం రాష్ట్రాల మధ్య గాలింపు..

    దొంగలను పట్టేందుకు ఉత్తరప్రదేశ్,ఘజీయబాద్, ఢిల్లీ లో ఖాకీ సినిమా రేంజి లో జల్లెడ పట్టిన నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్సై సైదా బాబు..

    నల్గొండలో వరుస పగటి చోరీలతో ప్రజల్లో భయాందోళన నెలకొన్న వేళ.!

    ఖాకీ సినిమా క్లైమాక్స్‌ను తలపించే రీతిలో ఆపరేషన్ నిర్వహించి అంతర్రాష్ట్ర దొంగ ముఠాకు భారీ షాక్ ఇచ్చారు...

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో, అదనపు ఎస్పీ జి. రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ ఎ. రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ కె. ఆది రెడ్డి, వన్ టౌన్ ఎస్సై సైదా బాబు ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి...

    సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు,నిఘా సమాచారం, ప్రతి క్లూను జల్లెడ పట్టిన పోలీసులు...

    ఇవి కూడా చదవండి

    చివరకు పానగల్ బైపాస్ వద్ద ఉచ్చుపన్ని ఢిల్లీకి చెందిన కరడుగట్టిన దొంగ మహమ్మద్ నసీమ్ (48) ను అదుపులోకి తీసుకున్నారు...

    విచారణలో నిందితుడు నల్గొండలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు ఉత్తరప్రదేశ్ ఘజీయబాద్, ఢిల్లీ పలు రాష్ట్రాల్లో జరిగిన చోరీల్లో తన ప్రమేయాన్ని ఒప్పుకోవడంతో కేసు ఒక్కసారిగా సంచలన మలుపు తిరిగింది...

    నిందితుడి వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, DL-5S-DS-1374 స్కూటీ, రెండు ఇనుప రాడ్లు, మాస్క్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం...

    ఈ ముఠాలోని ఇర్షాద్, షరీఫ్ పరారీలో ఉండగా... వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రాష్ట్రాల మధ్య సమన్వయంతో గాలింపు కొనసాగిస్తున్నాయి...

    ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ డి. సైదబాబు, ఎస్‌ఐ ముత్తయ్య, జి. మానస, పోలీసు సిబ్బంది రబ్బాని, శంకర్, అంజద్, లావూరి బాలకోటి, మహమ్మద్ షకీల్, జానకి రాములు, హోం గార్డ్ శ్రీనులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

    "చోరీకి వచ్చిన దొంగ... ఖాకీల వ్యూహానికి చిక్కి కటకటాల పాలయ్యాడు... నల్గొండ పోలీసుల ఆపరేషన్ ఖాకీ సినిమా రేంజ్ ల ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది."