EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

    వాతావరణ శాఖ హెచ్చరికల  నేపథ్యంలో  జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

    రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండడం, అలాగే తక్కిన ప్రాంతాలలో భారీ వర్షాలు వచ్చేందుకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
    గురువారం అయన హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
    భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి అధికారులెవరు సెలవు పై వెళ్లవద్దని, అందరు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాలలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ,రహదారులు అన్నిచోట్ల అప్రమత్తం చేయాలని, ఎక్కడైనా పడిపోయేందుకు అవకాశం ఉన్న గృహాలు, భవనాలను గుర్తించి అక్కడి వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలలో ఉంచేలా చూడాలని, వర్షాల వల్ల ప్రజలు పడకుండా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఓఆర్ఎస్ పాకెట్లు, పాము, తేలుకాటు వంటి వాటికి మందులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలలో ప్రజలకు సహకరించేందుకుగాను ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ టీములను సిద్ధంగా ఉంచడం జరిగిందని ,భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం సంభవించకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఇందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
    అనంతరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల అధికారులు కార్య స్థానాలు వదిలి వద్దని, ఎవరు సెలవు పై వెళ్ళరాదని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కంట్రోల్ రూమ్ లో సమాచారం అందించేందుకు ఫోన్ నెంబర్ 1800 425 1442 ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్నారు.
    రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ఓ ఆర్ .దశరథ, సిపిఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి టి. శేఖర్ ,తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

    వాతావరణ శాఖ హెచ్చరికల  నేపథ్యంలో  జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు  - Additional Image