EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *NTR జిల్లా IVF నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ*

    *NTR జిల్లా IVF నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ*

    ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) ఆధ్వర్యంలో NTR జిల్లా కమిటీ, జిల్లా మహిళా కమిటీ, జగ్గయ్యపేట పట్టణ కమిటీ మరియు పట్టణ మహిళా కమిటీల నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జగ్గయ్యపేటలోని శ్రీ కేశవ వెంకటేశ్వరస్వామి & శ్రీ దుర్గి వెంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడింది.
    ఈ కార్యక్రమానికి IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య గారు అంబిక కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
    సభా అధ్యక్షులు గా IVF ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కోనే శ్రీనివాసరావు గారు సభాధ్యక్షత వహించారు.
    ఈ సందర్భంగా జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య గారు మాట్లాడుతూ, వైశ్య సమాజం వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సేవా రంగాల్లో దేశ అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని కొనియాడారు. సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయడంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.
    ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో IVF బలోపేతానికి కృషి చేయాలని రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వైశ్యులు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లుగా గెలవాలని ఆయన అన్నారు.
    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు సమాజ శ్రేయస్సు, యువత సాధికారత, మహిళల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
    అంబిక కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ, సంస్థ ఆశయాలను గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తరించే బాధ్యత ప్రతి కమిటీ సభ్యుడిపై ఉందన్నారు. వైశ్య సమాజాన్ని మరింత సంఘటితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. నూతన కమిటీలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి, సమాజంలో సంస్థకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
    ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీ, మహిళా కమిటీ, పట్టణ కమిటీ, మహిళా పట్టణ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ముఖ్య అతిథులు నూతన పదాధికారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి అభినందించారు.
    నూతన కమిటీ సభ్యులు.
    I.V.F. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యన్. టి. ఆర్. జిల్లా కమిటీ
    ప్రెసిడెంట్
    శ్రీ బొడ్డు మురళీకృష్ణ మురళీకృష్ణ గారు, దేవి శ్రేష్ఠ గోల్డ్ & డైమండ్
    ట్రెజరర్
    శ్రీ పెనుగొండ రామకృష్ణ గారు, జగ్గయ్యపేట
    జిల్లా కో-ఆర్డినేటర్ & పి.ఆర్.ఓ
    శ్రీ నందిగామ గౌరి శంకర్ గారు
    వైస్ ప్రెసిడెంట్
    శ్రీ పాలవాది హనుమంతరావు గారు
    2వ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కుక్కడపు వెంకట నాగేశ్వరరావు గారు, విస్సన్నపేట
    4వ వైస్ ప్రసిడెంట్ శ్రీ కొలిశెట్టి గోపాల్ గారు 6వ వైస్ ప్రసిడెంట్
    శ్రీ కాలిపర్తి లక్ష్మీనారాయణ గారు
    I.V.F. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యన్. టి. ఆర్. జిల్లా కమిటీ
    ప్రెసిడెంట్
    శ్రీ బొడ్డు మురళీకృష్ణ మురళీకృష్ణ గారు, దేవి శ్రేష్ఠ గోల్డ్ & డైమండ్
    ట్రెజరర్
    శ్రీ పెనుగొండ రామకృష్ణ గారు, జగ్గయ్యపేట
    జిల్లా కో-ఆర్డినేటర్ & పి.ఆర్.ఓ
    శ్రీ నందిగామ గౌరి శంకర్ గారు
    వైస్ ప్రెసిడెంట్
    శ్రీ పాలవాది హనుమంతరావు గారు
    2వ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కుక్కడపు వెంకట నాగేశ్వరరావు గారు, విస్సన్నపేట
    4వ వైస్ ప్రసిడెంట్ శ్రీ కొలిశెట్టి గోపాల్ గారు
    6వ వైస్ ప్రసిడెంట్
    శ్రీ కాలిపర్తి లక్ష్మీనారాయణ గారు
    యూత్ ప్రసిడెంట్
    శ్రీ మొరిశెట్టి కృష్ణ చైతన్య గారు
    విద్యా కమిటీ చైర్మన్
    శ్రీ దారా శ్రీనివాసరావు గారు
    సెక్రటరీ శ్రీ చిన్ని సుబ్రహ్మణ్యం గారు
    2వ సెక్రటరీ
    శ్రీ వజినేపల్లి వెంకటేశ్వరరావు గారు
    జాయింట్ సెక్రటరీ
    శ్రీ చిన్న సాంబశివరావు గారు
    4వ జాయింట్ సెక్రటరీ
    శ్రీ నూకల లక్ష్మణరావు గారు
    1వ ఇ.సి. మెంబర్
    శ్రీ చీల నాగేశ్వరరావు رد3వ ఇ.సి. మెంబర్
    శ్రీ గుడిమెట్ల మురళి గారు
    ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ గారు, IVF Youth కోశాధికారి నరేష్ గుప్త గారు, IVF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప కోశాధికారి సూర్య ప్రకాష్ గారు, IVF రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా నాయకులు, వైశ్య ప్రముఖులు, మహిళా ప్రతినిధులు, యువజన నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

    *NTR జిల్లా IVF నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ* - Additional Image*NTR జిల్లా IVF నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ* - Additional Image*NTR జిల్లా IVF నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ* - Additional Image