ఏ ఈ ఈ సివిల్, ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ ఈ ఈ సివిల్, ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన ఈ పరీక్షలు నిర్వహిస్తున్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్పిఆర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వెళ్లి తనిఖీ చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఏఈఈ సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలకు 179 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం 10 నుండి 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు నిర్వహించిన మొదటిరోజు పరీక్షకు 104 మంది అభ్యర్థులు హాజరుకాగా,...