అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందనినల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీ దేవసేన అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమని నల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీ దేవసేన అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, చండూరు ఆర్డీవో మరియు మునుగోడు ఈ ఆర్ ఓ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ ప్రక్రియ పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సర్ ప్రక్రియ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడంలో అధికారులతో పాటు, రాజకీయ పార్టీల పాత్ర ముఖ్యమని అన్నారు. సర్ ప్రక్రియలో అధికారులతో కలిసి పని చేయాలని రాజకీయ పార్టీల...