చెర్లపల్లి, కాప్రా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లిఫ్టుల సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చెర్లపల్లి, కాప్రా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లిఫ్టుల సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెర్లపల్లి, కాప్రా ప్రాంతాల్లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లిఫ్టులు పనిచేయకపోవడంతో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు సచివాలయంలో హౌసింగ్ ఎండీ గౌతమ్, ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. లిఫ్టుల మరమ్మతులు చేపట్టి, వాటిని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎండీ గౌతమ్, ఐఏఎస్ గారిని ఎమ్మెల్యే కోరారు....