నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు.

నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. గురువారం ఆయన నకిరేకల్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి రిజిస్టర్, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శోభ, ఇతర డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు . డాక్టర్లు సిబ్బంది హాజరు, ఫార్మసీ,ఎమర్జెన్సీ వార్డు, లేబర్ రూమ్, స్టోర్ రూమ్, గైనిక్ వార్డులను తనిఖీ చేశారు. డాక్టర్లు ,సిబ్బంది సమయపాలన పాటించాలని, అలాగే ఆసుపత్రికి వచ్చిన వారందరికీ మంచి వైద్య సేవలందించాలని చెప్పారు. ఆసుపత్రిలో శానిటేషన్ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి...