నల్గొండ రెడ్‌క్రాస్‌కు తొలి మహిళా చైర్‌పర్సన్*
*నల్గొండ రెడ్‌క్రాస్‌కు తొలి మహిళా చైర్‌పర్సన్* హేమలత ప్యానెల్‌కు 8 స్థానాలు.. అమరేందర్ రెడ్డి ప్యానెల్‌కు 7... కీలక పదవులకు ఏకగ్రీవ ఎంపిక.. కొత్త కార్యవర్గంపై సేవాభిమానుల ఆశలు... నల్గొండ, అక్టోబర్ 12: నల్గొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో నూతన నాయకత్వం కొలువుదీరింది. సుమారు 12 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న నిర్వహణ వ్యవస్థకు ఈసారి ఎన్నికలతో మార్పు వచ్చింది. ఆదివారం నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికలు జరగ్గా, సోమవారం కీలక పదవుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సొసైటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ హేమలత ఎన్నికై చరిత్ర సృష్టించారు. నల్గొండ రెడ్‌క్రాస్ సొసైటీకి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. *రెండు ప్యానళ్ల మధ్య హోరాహోరీ...