ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారా.. లేదా? క్లారిటీ ఇదే!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారా.. లేదా? క్లారిటీ ఇదే! తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీపై సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఆయనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి సుముఖంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అయితే తాజాగా ఆయన ఎమ్మెల్సీ పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు...