ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరమని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టులు వృత్తి గౌరవాన్ని నిలబెట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరమని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టులు వృత్తి గౌరవాన్ని నిలబెట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్యమాలపై నిర్వహించిన ఒకరోజు వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని మెరుగైన జర్నలిజాన్ని ప్రజలకు అందించేందుకు, అలాగే వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా జర్నలిస్టులకు ఉపయోగపడుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో...