జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత గాంధీజీని ఆదర్శంగా తీసుకొని జీవించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఖైదీలకు పిలుపునిచ్చారు.

జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత గాంధీజీని ఆదర్శంగా తీసుకొని జీవించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఖైదీలకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నవ సమాజ నిర్మాణం లో భాగస్వాములు కావాలని, ఇందుకు ఖైదీలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముందుగా అ మార్పు తనలోనే రావాలని, గతంతో పోలిస్తే సమాజంలో ప్రస్తుతం అనేక మార్పులు వచ్చాయని, ఒకప్పుడు చదువు అంతగా ఉండేది కాదని, ప్రస్తుతం అందరూ చదువుకోవాలని కోరుకుంటున్నారని, జైలులో చదువు రాని ఖైదీలు...