అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసి నకిరేకల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసి నకిరేకల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ జిల్లా, నకిరేకల్ లోని వినాయక బంకేట్ హాల్లో జిల్లా అధికారులతో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం వెయ్యి రోజులలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ముఖ్యంగా 6 గ్యారంటీలు మొదలుకొని సన్న బియ్యం, స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నదని, విద్య ,వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని వేగవంతం చేయాలని, మొదలుపెట్టని పనులను...