పెసరపప్పు ఇడ్లీ ఇలా చేస్తే సూపర్ టేస్టీ!

పెసరపప్పు ఇడ్లీ ఇలా చేస్తే సూపర్ టేస్టీ! పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది పెసరపప్పుతో పెసరట్టు, పెసర వడలు చేస్తారు. పెసరపప్పుతో కూర కూడా చేసుకుంటారు. ఇంకా పెసరపప్పును ఇడ్లీలు చేసుకోవటానికి కూడా వినియోగించవచ్చు. పెసరపప్పుతో త్వరగా, సులభంగా రుచికరమైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. దీనికి పిండి పులియబెట్టాల్సిన అవసరం లేదు. నిమిషాల్లోనే రెడీ అయ్యే ఈ లైట్ బ్రేక్‌ఫాస్ట్ నోటికి రుచిగా, పొట్టకి హాయిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఉప్పు రుచికి, జీలకర్ర 1 టీస్పూన్, అల్లం ముక్కలు కొన్ని, పసుపు అర టీస్పూన్, పచ్చిమిర్చి 5, పెరుగు పావు కప్పు,...