ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సాహిత్యం ఆచరణీయమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సాహిత్యం ఆచరణీయమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కాలోజీ నారాయణరావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలో జన్మించిన కాళోజీ నారాయణరావు వరంగల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారని, చిన్నప్పటినుండి సాహిత్యం పై పట్టు సాధించారని, విభిన్న భాషలలో ప్రావీన్యులైన కాలోజి నారాయణరావు 1941 లో తన మొదటి కవితను ప్రచురించడం జరిగిందని ,అప్పటినుండి తన తుది శ్వాస విడిచే వరకు సాహిత్యంలో ప్రత్యేకించి తెలంగాణ సాహిత్యంలో...