ప్రజా పాలన పేదలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజా పాలన పేదలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అయన నల్గొండ జిల్లా, నకిరేకల్ మున్సిపాలిటీలో 344.92 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హెలికాఫ్టర్ ద్వారా నకిరేకల్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి వివిఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం 32 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ వైద్యశాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాన్వాయ్ ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ మినీ స్టేడియం...