ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్గొండ శ్రీధర్ గుప్త
ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్గొండ శ్రీధర్ గుప్త హైదరాబాద్: తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్‌గా శ్రీ ఆర్గొండ శ్రీధర్ గుప్త నియమితులైన సందర్భంగా తెలంగాణ వైశ్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA), తెలంగాణ వైశ్య మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ (TVMD) ఆధ్వర్యంలో హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఫార్మసీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన శ్రీధర్ గుప్త రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పరిశ్రమ అభివృద్ధి, ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన ప్రమాణాల పెంపుదలకు విశేషంగా కృషి చేశారు. హైదరాబాద్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేలాది ఫార్మసీలకు నాయకత్వం వహిస్తూ, ఫార్మసీ రంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు. 1990లలో “మిత్ర మెడికల్స్”తో...