రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతా: కొండా సుస్మిత
సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత షాకింగ్ కామెంట్స్! పరకాలలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని, మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఇటీవల జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయన్న కొండా సుస్మిత గత ఎన్నికలలో ఐదారు నియోజకవర్గాలలో విజయం సాధించడానికి తన తండ్రి కొండా మురళి ఎంతో కష్టపడ్డారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొండ మురళి రేవంత్ రెడ్డి కళ్ళకు కనిపించడం లేదని...