ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం మ్యాపింగ్ కానీ, జాబితాలో పేర్లు తేడా ఉన్న కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌

ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం మ్యాపింగ్ కానీ, జాబితాలో పేర్లు తేడా ఉన్న కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బి. సుదర్శన్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం 33,818 అన్‌మ్యాపింగ్‌ 2,34,972 అనామలీస్ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, తదుపరి...