ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపల్స్ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపల్స్ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తన ఛాంబర్లో ఇంటర్ విద్య పై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దశ్రు నాయక్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలాల్లో మెరుగైన ఫలితాలు వచ్చినప్పుడు ప్రవేశాల సంఖ్య కూడా పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 9 కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని,నమోదు శాతం తక్కువగా ఉన్న కళాశాలలు ప్రిన్సిపల్స్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు....