రైతు భీమా బంద్ - మారిన ప్రభుత్వ నిర్ణయం...!!

రైతు భీమా పథకం ఆగిపోయినట్లేనా. రైతులకు విపత్కర పరిస్థితుల్లో అందుతున్న రూ 5 లక్షల భీమా పథకం రెన్యువల్ కాలేదు. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని తెలుస్తోంది. ఈ స్థానంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రైతులకు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో... రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భీమా పథకం దాదాపు నిలిపివేసినట్లే కనిపిస్తోంది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్నారు. కాగా, ఆగస్టు 14వ...