ఢిల్లీ నుంచి బీజేపీ డిక్లేర్ - ఇక తేల్చుకోవాల్సింది పవన్..!!
బీజేపీ అధినాయకత్వం తేల్చేసింది. దక్షిణాదిన పార్టీ బలోపేతం పైన బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు నిర్దేశం చేస్తోంది. ఇదే సమయంలో పొత్తుల పైనా కీలక మంత్రాంగం చేస్తోంది. బెంగాల్ తరహా ఫార్ములా అమలు చేస్తే సొంతంగా ఎదిగే అవకాశం ఉంటుందని విశ్వసిస్తోంది. ఇదే క్రమంలో పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ ఫిక్స్ చేస్తోంది. బీజేపీ తాజా నిర్ణయంతో.. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన నిర్ణయం ఏంటో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ అధినాయకత్వం ప్లాన్ పక్కాగా ఉంది. తెలంగాణలో తమ పార్టీ విధానం ఏంటో తేల్చేసారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని, రాబోయే రోజుల్లో ఒంటరిగానే బరిలోకి...