హైదరాబాద్‌లో భారీగా ఓట్ల కోత - మునిగేదెవరు..!?
హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గ్రేటర్ లో త్వరలో ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో పాటుగా కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అటు ప్రధాన పార్టీలు సైతం గ్రేటర్ పైన రాజకీయంగా ఫోకస్ చేసాయి. హైదరాబాద్ లో రాజకీయ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో సర్ ప్రక్రియలో భాగంగా నగరం లో భారీగా ఓట్ల కోత ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిణామం రాజకీయం గా ఎవరిని ముంచుతుందనే చర్చ మొదలైంది. సర్ ప్రక్రియ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఓట్ల తొలిగింపు పైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి....