బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: అగ్రవర్ణాలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి!
బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: అగ్రవర్ణాలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి! : ఈ సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత ప్రసంగించారు. సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రజలంతా ఒకే వేదికపై సంకల్పం చేస్తున్నారన్నారు. సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారని.. అందరూ సమానంగా పంచుకోవాలన్నదే సామాజిక న్యాయం అని చెప్పుకొచ్చారు. అగ్రవర్ణ మిత్రులు ఒక్కసారి ఆలోచించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. Also Read...