కామన్వెల్త్ లో భారత్ స్థానం ఫైనల్ గా ఇదీ...

స్కాట్లాండ్ గ్లాస్గో వేదికగా సాగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు నూతన అధ్యాయాన్ని లిఖించారు. పతకాల వేటను విజయవంతంగా ముగించారు. ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారులకు సాంప్రదాయకంగా గట్టి పట్టున్న కొన్నింటిని తుది జాబితా నుంచి నిర్వాహకులు తొలగించినప్పటికీ, మన అథ్లెట్లు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పతకాల పట్టికలో దేశాన్ని తొలి అయిదు స్థానాల్లో నిలబెట్టారు. తమ సత్తా చాటారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 39 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో బంగారు- 13, రజతం- 17, కాంస్యం- 9 ఉన్నాయి. గట్టి పోటీ ఉన్న పలు విభాగాల్లో భారత అథ్లెట్లు తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో...