స్వర్గీయ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు
పి.వి నరసింహారావు మార్గ్(నెక్లెస్ రోడ్) లో మాజీ కేంద్ర మంత్రి,ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత దివంగత జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్బంగా వారి "స్ఫూర్తి స్థల్" వద్ద ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. దివంగత జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పలకరించి,వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ జై పాల్ రెడ్డి సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. మంత్రితో పాటు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు,నేతి విద్యాసాగర్ రావు,జూలకంటి రంగారెడ్డి...