*మియాపూర్ ధర్మపురి క్షేత్రంలో ఘనంగా కార్తీక మాస వనభోజనాలు*

కూకట్పల్లిలోని కన్యకా పరమేశ్వరి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్ కుమారస్వామి గారి నేతృత్వంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం మన హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని శ్రీనివాస్ గుప్త గారు పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య స్నేహసంబంధాలు, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన కన్యకా పరమేశ్వరి టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ కుమారస్వామి గారికి, ట్రస్ట్ సభ్యులకు, నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
2000 మంది ఆర్య వైశ్య సోదరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బండారు సుబ్బారావు IVF యూత్ అధ్యక్షుడు రవి కుమార్, కోశాధికారి నరేష్ గుప్త, ట్రస్ట్ సభ్యులు, భక్తులు, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.