🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 14 Nov, 2026 | Page: 1

*యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి*

*యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి*
- *టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యాట్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త*
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచర్ల లోని శాలిని సురేష్ బ్యాడ్మింటన్ అకాడమీలో నవంబర్ 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీమతి ఎపూరి స్వరూప రాణి మెమోరియల్ తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026 ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు.
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బ్యాట్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చిన్న వయస్సు నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉంటాయని అన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం, వేదికలు కల్పిస్తే అద్భుతమైన విజయాలు సాధించగలరని తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో 760 మంది అండర్-13, అండర్-15, అండర్-17 అండర్ 19 బాలబాలికల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మొత్తం రూ.2.25 లక్షల ప్రైజ్ మనీతో పోటీలను నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం, పోటీతత్వం పెరుగుతాయని అన్నారు.
పుల్లెల గోపీచంద్ పీవీ సింధు లాగా రాణించాలి అని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు
టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ శాలిని సురేష్‌ను అభినందించారు.
🏠 Home