🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 14 Nov, 2026 | Page: 1

ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా బైరు సైదులు గౌడ్ నియామకం..


ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం అమలుకు కృషి చేయాలి...

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

పదేళ్ల సేవలకు గుర్తింపుగా ఆర్టీఐ కమిటీలో అవకాశం..

ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తా..

ప్రజలకు, అధికారులకు వారధిగా ఉంటా..

మానీటరింగ్ కమిటీ సభ్యులు బైరు సైదులు గౌడ్

నల్గొండ, నవంబర్ 13 (****): నల్గొండ జిల్లా ఆర్టీఐ (సమాచార హక్కు) మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నల్గొండ పట్టణానికి చెందిన బైరు సైదులు గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ నియామక ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం కలెక్టర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం - 2005 సమర్థవంతంగా అమలయ్యేలా కమిటీ సభ్యుడు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులకు చట్టంపై అవగాహన కల్పిస్తూ, సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే పౌరులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బైరు సైదులు గౌడ్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు, ప్రజల్లో అవగాహన కల్పన కోసం చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, ఆర్డీఓ అశోక్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ అధికారులకు, సామాన్య ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలన అందేలా నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, సమాచారాన్ని పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.తన నియామకానికి సహకరించిన సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి, మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాచం సత్యనారాయణ, దయాకర్ రావు, మారం గోనారెడ్డి, కోటగిరి ధైవాధీనం, గందమళ్ళ జయంత్, గాదె వినోద్ రెడ్డి, యర్రమాద హేమలత, బోగరి రామకృష్ణ, యాళ్ల చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, కర్నాటి యాదగిరి, కార్యదర్శి తుంగతుర్తి రామకృష్ణ, గంటేకంపు గణేష్, బీమనపల్లి నగేష్, అదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home