🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 14 Nov, 2026 | Page: 1

*ఖరీదైన ఎయిర్టెల్ టవర్ రేడియో రిమోట్ యూనిట్ లే వారిటార్గెట్*

*ఖరీదైన ఎయిర్టెల్ టవర్ రేడియో రిమోట్ యూనిట్ లే వారిటార్గెట్*
*పనిచేస్తున్న సంస్థలోనే వరుస రేడియో రిమోట్ యూనిట్ చోరీలకు పాల్పడ్డ ఇంజినీయర్ల ముఠా గుట్టును రట్టు చేసిన చేసిన నల్గొండ సి‌సి‌ఎస్ పోలీసులు.*
 *తెలుగు రాష్ట్రాలలో మొత్తం 38 నేరాలకు పాల్పడిన ముఠా సభ్యులు. దాదాపు 1 కోటి 62 వేల రూపాయల విలువ గల చోరీ* ...
 *వీరి వద్ద నుండి, 25 లక్షల విలువగల 3 కార్లు రెండు బైకులు, 15 లక్షల నగదు,08 మొబైల్ ఫోన్లు స్వాధీనం*
- *జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్*
(Cr.No.167/2026 U/s 303(2) BNS of Thripuraram PS)
(Cr.No. 238/2026 U/s 303(2) BNS of Nalgonda Rural )
ఇటీవల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో అంతు చిక్కకుండ వరుసగా జరుగుతున్న మొబైల్ టవర్ లకు సంబంధించిన రేడియో రిమోట్ యూనిట్ దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు నల్లగొండ సి‌సి‌ఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో (02 ) ప్రత్యేక సి‌సి‌ఎస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని వివిద ప్రదేశాలలో దర్యాప్తు జరిపి సాంకేతిక పరిజ్ఞానంతో ఇట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును రట్టు చేయడము జరిగింది. ఇట్టి బృందాలు మొదట నేరాలకు పాల్పడుతున్నది బయట వ్యక్తులు అని భావించినప్పటికీ, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇట్టి నేరాలకు పాల్పడుతున్నది సంస్థలోనే పనిచేస్తున్న ముగ్గురు ఇంజనీర్లు, నలుగురు రిగ్గర్లు (టెక్నీషియన్లు), డ్రైవరు మరియు గతంలో సంస్థలో పనిచేసిన ఉన్యోగితో కలిసి ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నమ్మకంగా పనిచేస్తూ, తమకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి సొంత సంస్థకే నష్టం కలిగించినట్లు గుర్తించారు. ఇట్టి ముఠా పై నిఘా ఉంచిన ప్రతెక బృందాలు ముఠాలోని మొత్తం (09) మంది నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
*కేసు వివరాలు* :
త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ: 21-09-2026, 11-11-2026 రోజు మహమ్మెద్ యౌసుఫ్ పాషా, తండ్రి. జలాల్, నివాసము. ఎస్‌టి కాలనీ, నల్లగొండ, వృతి: S & IB Security Mobile Patrolling Guard, త్రిపురారం మండలము కామారెడ్డి గ్రామము నందు, నల్గొండ మండలం మెల్లదుప్పలపల్లి గ్రామంలలో ఉన్న మొబైల్ టవర్ ఇండస్ ఐ‌డిలు -1319752, 3173101 టవర్ యొక్క రేడియొ రిమోట్ యూనిట్ లను ఎవరో గుర్తు తెలియని దొంగలు వైర్లు కత్తిరించి దొంగతనము చేశారని త్రిపురారం, నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయగా, త్రిపురారం మరియు నల్గొండ రూరల్ ఎస్‌ఐ గార్లు Cr.Nos.167/2026 U/s 303(2) BNS of Tripuraram PS మరియు 238/2026 U/s 303(2) BNS నల్గొండ రూరల్ పి‌ఎస్ లలో కేసులను నమోదు చేసినారు. తదుపరి ఇట్టి కేసు విచారణ నిమిత్తము జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవర్, ఐ‌పి‌ఎస్ గారు సి‌సి‌ఎస్ సిబ్బంది తో (02) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటము జరిగింది.
*ముఠా గుట్టు రట్టు చేసిన నల్లగొండ సి‌సి‌ఎస్ పోలీసులు* :
ఈ క్రమంలో మొదటి బృందం తేదీ 14-11-2026 నాడు నల్గొండ రూరల్ పోలీసు వారు గిగిరకలబావిగూడెం శివారులోని చింతచెట్టువద్ద సుమారు 13: 00 గంటల ప్రాంతంలో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా రెండు కార్లు ఒక బైక్ పై 5గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి కార్లను తనికి చేయగా వారిలో 1. భూక్యా బాలు అతనితో పాటు మరో నలుగురిని విచారించగ వారు కాంచనపల్లి గ్రామంలో ఆర్‌ఆర్‌యూ ల చోరీలకు పాల్పడటానికి వెళుతున్నాము అని తెలిపినారు. అదేవిదంగా సుమారు 13:00 గంటల ప్రాంతంలో త్రిపురారం పోలీసువారు బాబా సాయి పేట త్రిపురారం వద్ద వాహన తనికి చేస్తున్న్డగా ఒక కార్లు రెండు బైక్ పై 4గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి విచారించగ అందులోని ఒక వ్యక్తిని పాతనేరస్థుడు ఐనా రమవథ్ సూమన్ గా గుర్తించి వారందరినీ అదుపులోనికి తీసుకొని విచారించగ వీరు గతం లో చేసిన ఆర్‌ఆర్‌యూ ల దొంగతనాలకు సంబందించి వివరాలను తెలిపినారు.
*పట్టుబడిన నిందితుల వివరాలు*
1. నకిరేకంటి స్వర్ణ కుమార్, తండ్రి: వెంకటయ్య, వయస్సు: 32, వృత్తి: సైట్ ఇంజనీర్ (మిర్యాలగూడ), నివాసం: యాదవ కాలనీ, దామరచర్ల, నల్గొండ.
2. .భూక్యా బాలు తండ్రి: శంకర్, వయస్సు 33 వృత్హి సైట్ ఇంజెనీర్ నల్గొండ నివాసం : హనుమాన్నగర్ నల్గొండ
3. శ్రీకాంత్ రెడ్డి, తండ్రి: నారాయణ రెడ్డి, వయస్సు: 35, వృత్తి: ఎయిర్‌టెల్ ఇంజనీర్ (కోదాడ), నివాసం: బరకత్ గూడెం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా.
4. రమవత్ సుమన్, నివాసం: ధీరావత్ తండా, మిర్యాలగూడ మండలం. పూర్వం ఎయిర్టెల్ సంస్థ నందు ఉద్యోగి గా పని చేసినాడు.
5. లకావత్ రాములు, తండ్రి: దీప్లా, వయస్సు: 52, వృత్తి: పూర్వం ఎయిర్టెల్ సంస్థ నందు రిగ్గర్ గా పని చేసినాడు, నివాసం: హేమ్లా తండా, మేళ్లచెరువు, సూర్యాపేట జిల్లా.
6. జక్కల నితీష్ కుమార్, తండ్రి: వెంకటేశం, వయస్సు: 24, వృత్తి: నల్గొండలోని ఎయిర్‌టెల్ టవర్లలో కారు డ్రైవింగ్, నివాసం: చెట్ల చెన్నారం, కనగల్ మండలం, నల్గొండ జిల్లా.
7. పెంటమల్ల మహేష్, తండ్రి: జాను, వయస్సు: 24, వృత్తి: ఎయిర్‌టెల్ రిగ్గర్, నివాసం: దాచారం గ్రామం, నేరేడుచర్ల మండలం.
8. భీమనపల్లి రవి, తండ్రి: వెంకన్న, వయస్సు: 34, వృత్తి: సెల్ టవర్ టెక్నీషియన్ (మిర్యాలగూడ), నివాసం: హౌసింగ్ బోర్డు, మిర్యాలగూడ.
9. అంగోతు తిరుపతి, తండ్రి: తానియా, వయస్సు: 39, వృత్తి: ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ రిగ్గర్, నివాసం: హేమ్లా తండా గ్రామం, మేళ్లచెరువు మండలం, సూర్యాపేట జిల్లా.
*నేరాలకు పాల్పడిన విధానం* :
విలాసవంతమైన జల్సాలకు అవవాటుపడి తక్కువ సమయములో ఎక్కువ డబ్బులు సంపాడిచాలనే ఉద్దేశముతో సగటు సంస్థనే దోచేయాలి అనే చెడు ఉద్దేశముతో అన్నము పెట్టిన సంస్థకె కన్నము పెట్టారు అందులో పని చేస్తున్న ముగ్గురు ఇంజినీర్లు మరియు ఆరుగు సిబ్బంది. తదానుగుణముగా వారు వారి పరిధిల్లోని మొబైల్ టవర్లపై ఉండే ఆర్ ఆర్ యు లను లక్ష్యంగా టవర్ వద్దకు రాత్రి సమయంలో చేరుకుని అట్టి టవర్ లపై ఉండే ఖరీదైన ఆర్ ఆర్ యు యూనిట్ లను దొంగిలించి వాటిని హైదరాబాద్ నందు అమ్మి వచ్చిన డబ్బు తో విలాస వంతమైన కార్లు, బైక్లు కొనడము మరియు జల్సాలకు మరియు ఇతర అవసరాలకు ఉపయోగించుకునేవారు.
విచారణలో బయటపడిన కేసులు:-
నల్గొండ -9
మిర్యాలగూడ -16
దేవరకొండ -2
సూర్యాపేట -8
Other డిస్ట్రిక్ట్ -3
ఈ కేసును CCS ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన, త్రిపురారం SI K.నరేశ్ మరియు నల్గొండ రూరల్ ఎస్‌ఐ , సి‌సి‌ఎస్ ఎస్‌ఐ సురేశ్, సి‌సి‌ఎస్ హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, ఫయాజ్ నాగరాజు, కానిస్టేబుళ్లు అస్రార్, సాయి, శివర్రాజు, నరేష్ లను జిల్లా ఎస్పీ గారు అభినందించి రివార్డ్ ప్రకటించనైనది
🏠 Home