అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందనినల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీ దేవసేన అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమని నల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీ దేవసేన అన్నారు.
మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, చండూరు ఆర్డీవో మరియు మునుగోడు ఈ ఆర్ ఓ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ ప్రక్రియ పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సర్ ప్రక్రియ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడంలో అధికారులతో పాటు, రాజకీయ పార్టీల పాత్ర ముఖ్యమని అన్నారు. సర్ ప్రక్రియలో అధికారులతో కలిసి పని చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం సర్ ఫారాలపై వచ్చిన అభ్యంతరాలను నవంబర్ 5 వరకు పరిష్కరించేందుకు అవకాశం ఉందని, ఇంకా ఎక్కడైనా అర్హులైన వారు ఓటరుగా నమోదు కు అవకాశం ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాంటి వారందరిని గుర్తించి ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలని చెప్పారు. అర్హులు ఏ ఒక్కరు ఓటరు జాబితా నుండి తప్పిపోకూడదన్నారు.రాజకీయ పార్టీలు ఇంకా ఎక్కడైనా బిఎల్ఏ లను నియమించకుంటే వెంటనే నియమించాలని కోరారు. రాబోయే వారం రోజులు సర్ ప్రక్రియలో అర్హులైన వారందరూ ఓటరుగా నమోదయ్యేలా పక్కాగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆమె ప్రతివారం నిర్వహించే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశానికి హాజరవుతున్నారా? ఓటరు జాబితాలో చనిపోయిన, తొలగించిన వారి పేర్లను చూసుకున్నారా? లేదా అని అడిగి రాజకీయ పార్టీల ప్రతినిధులను తెలుసుకున్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో సర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగిందని, ప్రతివారం క్రమం తప్పకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు నిర్వహించారని ,సర్ పై తమకు వచ్చిన సందేహాలన్నింటిని ఈ ఆర్ ఓ,ఆర్డిఓ ఎప్పటికప్పుడు తీర్చారని, సర్ ప్రక్రియలో ఈఆర్వో,ఏ ఈ ఆర్ ఓ లందరు బాగా కృషి చేశారని అభినందించారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని హియరింగ్స్ ను పూర్తి చేయడం జరిగిందని, వచ్చిన ఫారం 6 ,7, 7 ఏ పరిశీలించామని,అన్ కలెక్టెడ్ ఫారాలన్నింటిని బిఎల్ఎ ల సమక్షంలో పరిశీలించడం జరిగిందని, ఫారం 6,7,8 లపై వచ్చిన అభ్యంతరాలను నవంబర్ 5 న పరిష్కరించేందుకు చివరి తేదీగా ఈసీ నిర్ణయించడం జరిగిందని, నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు . మిగిలిపోయిన అభ్యంతరాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఓటరు జాబితా పరిశీలకురాలికి వివరించారు.
అనంతరం ఓటరు జాబితా పరిశీలకురాలు జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్ఓ లతో సర్ ప్రక్రియపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఫారం 6,7,7ఏ,8 లను వివిధ స్థాయిలలో చేసిన తనిఖీ , ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ల అవసరం ,ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఓటరు జాబితా సవరణ, తదితర అంశాలపై సమీక్షించారు. అలాగే వివిధ పారాలపై వచ్చిన అభ్యంతరాలపై ఏర్పాటు చేసిన హియరింగ్స్ కు ఓటర్లకు సరైన సమయం ఇచ్చింది లేనిది అడిగి తెలుసుకున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి రికార్డులన్నింటినీ జాగ్రత్తగా నిర్వహించాలని ,బిఎల్ఓ యాప్ లో అన్ని వివరాలు నమోదు అయ్యేలా చూడాలని , రెండు చోట్ల నమోదైన ఓటర్ల వివరాలను మరోసారి తనిఖీ చేయాలని, ఫోటో ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక సర్ ప్రక్రియ మొత్తం పూర్తి జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోవాలని, పూర్తి పారదర్శకంగా చేయాలని, సర్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే ఎన్నికల సంఘం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,ఈ ఆర్ ఓ దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, నల్గొండ ఈఆర్వో ,ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మిర్యాలగూడ ఈఆర్ఓ ,ఆర్డిఓ రమణారెడ్డి, చండూర్ ఆర్డిఓ మరియు మునుగోడు ఈఆర్వో శ్రీదేవి, ఆయా నియోజకవర్గాలఏ ఈ ఆర్ ఓ లు, తహసిల్దార్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
______________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*